సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, మంగళవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ నేతలకు స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహంపై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో కూటమి గెలవాలని పిలుపు ఇచ్చారు. వైసీపీ ని ఉద్దేశించి కొందరు దింపుడు కళ్లెం ఆశతో ‘సర్’ పైనా, రిజర్వేషన్లపైనా కోర్టులకు వెళ్లారని విమర్శించారు. ఈ కార్యక్రమానికి భీమవరం నుండి టీడీపీ ఇంచార్జి తోట సీతారామ లక్ష్మి మరియు జిల్లా టీడీపీ అడ్జక్షుడు మంతెన రామరాజు తదితరులు హాజరు అయ్యారు.ఈసారి డైరెక్ట్ ప్రజాభిప్రాయం ప్రతిబింబించేలా మేయర్లు, చైర్మన్లను ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నుకోవాలని నిర్ణయించామని అన్నారు. ప్రతి చోట ప్రజలకు దగ్గరగా వారి మన్ననలను పొందిన బెస్ట్ అభ్యర్థులను నిలిపేలా ప్రతి ఒక్కరం జాగ్రత్త పడాలని సూచించారు. నిలబెట్టే అభ్యర్థుల వల్ల పార్టీకి, ప్రభుత్వానికి నష్టం లేకుండా చూడాలని ఆదేశించారు.
