సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మెగాస్టార్ చిరంజీవి సినిమా విశ్వంభర నుంచి నేడు,శనివారం హనుమాన్ జయంతి కానుకగా రామ.. రామ సాంగ్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. విదులైన కొద్ది సేపటికే ఈ సాంగ్ బాగా వైరల్ అయ్యింది. . చిరంజీవి హీరోగా బింబిసారా దర్శకుడు వసిష్ఠ మల్లిడి డైరెక్షన్ లో వస్తున్న విశ్వంభర. సోషియో ఫాంటాషి నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. సంక్రాంతి విడుదల కావాల్సిన ఈ సినిమా టీజర్ లో గ్రాఫిక్స్ క్వాలిటీ ,విజువల్ ఎఫెక్ట్ ఫై విమర్శలు రావడంతో మరింత క్వాలిటీ కోసం రిలీజ్ వాయిదా వేశారు. ఈ చిత్రంలో చిరంజీవి హనుమంతుడి భక్తుడిగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఆంజనేయస్వామి శ్రీరాముడి భక్తుడు.హనుమంతుని వైభవాన్నీ తెలియజేస్తూ సాగిన సాంగ్ బాగుంది. రాములోరి గొప్ప చెప్పుకుందామా సాములోరి పక్కన ఉన్న సీతమ్మ లక్షణాలు చెప్పుకుందామా అంటూ సాగిపోతూ ఆకట్టుకుంటోంది. ‘జై శ్రీరామ్’ అంటూ వచ్చిన చిరంజీవి వాయిస్ సపోర్ట్ చేసారు. శంకర్ మహదేవన్ స్వరంలో ఈ పాటలో రామ జోగయ్య శాస్త్రి లిరిక్స్, కీరవాణి బాణీలు హైలైట్ అవుతున్నాయి. ఈ సినిమాలో చిరు సరసన త్రిష హీరోయిన్‌గా నటిస్తోంది. తాజా సమాచారం మేరకు ఈ చిత్రాన్ని జూలై 24న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
