సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా 5 ఏళ్ళ కాలం సుదీర్ఘంగా షూటింగ్ జరిగి ఎట్టకేలకు వచ్చే జూన్ 12వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా పాన్ ఇండియా సినిమాగా విడుదల అవుతున్న ‘హరి హర వీరమల్లు’ సినిమా కు పవన్ డబ్బింగ్ కూడా చెప్పేసారు. ఇక సినిమా ప్రమోషన్ లో భాగంగా చెన్నాయి లో జరిగిన మీడియా సమావేశం తరువాత నిర్మాత ఎ.ఎం .రత్నం అనారోగ్యం బారిన పడి స్పృహ తప్పి పడిపోయారనే వార్త భారీ స్థాయిలో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిపై ఆయన సోదరుడు, నిర్మాత దయాకర్ రావు స్పష్టత నిచ్చారు. ఆ వార్తలను నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు.‘‘అన్నయ్య ఆరోగ్యం ఫై వస్తున్నా రూమర్స్ నమ్మకండి. ఆయన పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. దయచేసి ఇలాంటి రూమర్స్ ను ప్రచారం చేయకండి’’ అని పోస్ట్ పెట్టారు. అయితే ఏ ఎం రత్నం స్వయంగా వీడియో పోస్ట్ పెట్టచ్చు కదా? అని కొందరు కామెంట్స్ పెడుతున్నారు.
