సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశవ్యాప్తంగా ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS)లోని రేషన్ వ్యవస్థలో ఉన్న నకిలీ, డూప్లికేట్, క్రియాశీలంగా లేని లేదా అనుమానాస్పద లబ్ధిదారులను గుర్తించి ప్రక్షాళన చేసేందుకు కేంద్రం చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో గత ఆరు నెలలుగా రేషన్ తీసుకోని 15.8 మిలియన్లు అంటే సుమారు 1.58 కోట్ల మంది లబ్ధిదారుల రేషన్ ఎంటైటిల్‌మెంట్లను అక్టోబర్ నుంచి తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు నివేదికలు అందుతున్నాయి. అయితే రేషన్ కార్డులను వెంటనే శాశ్వతంగా డేటాబేస్ నుంచి తొలగించరు. ముందుగా వాటిని తాత్కాలికంగా డిసేబుల్ చేస్తారు. అర్హత ఉన్న నిజమైన లబ్ధిదారులు తమ వివరాలను నిర్ధారించుకునేందుకు మూడు నెలల సమయం ఉంటుంది. ఈ సమయంలో e-KYC పూర్తి చేసి, అవసరమైన ధ్రువీకరణ ప్రక్రియ పూర్తి చేస్తే కార్డును మళ్లీ యాక్టివేట్ చేసే అవకాశం ఉంటుంది.
