సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీ లోని కూటమి ప్రభుత్వం కొంతకాలంగా కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని రెగ్యులరైజ్ . క్రమద్ధీకరణకు సంబంధించిన సమస్యల్ని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తోంది. తాజాగా సెకండరీ హెల్త్‌లో ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణకు లైన్ క్లియర్ చేసింది. సెకండరీ హెల్త్‌ పరిధిలో అర్హులైన కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని క్రమబ్ధీకరించేందుకు ఆర్థిక శాఖ నుంచి క్లియరెన్స్ వచ్చింది. గతంలో సాంకేతిక సమస్యల కారణంగా ఇబ్బందులు ఎదురవ్వగా.. వాటిని పరిష్కరించి క్రమబద్ధీకరణకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేసింది.. రాష్ట్ర ప్రభుత్వం గతంలో కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని క్రమబద్ధీకరించేందుకు 30/2023 ద్వారా చట్టాన్ని తీసుకొచ్చింది. రాష్ట్ర విభజన నాటికి వివిధ ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులుగా విధుల్లో ఉన్నవారు ఈ క్రమబద్ధీకరణకు అర్హులుగా నిర్ణయించారు. అలాగే ఏపీవీవీపీ (ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్తు)ను రద్దు చేసి డీఎస్‌హెచ్‌ (సెకండరీ హెల్త్‌ డైరెక్టరేట్‌) ఏర్పాటు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *