సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలలో నామినేషన్ వెయ్యడానికి వచ్చిన అభ్యర్థులపై జరిగిన దాడులతో జరిగిన ‘ఏకగ్రీవాలు’ చెల్లవని అక్కడ నామినేషన్స్ వెయ్యడానికి మరో 2 రోజులు అంటే ఈ నెల 25 వరకు అభ్యర్థులకు గడువు పెంచాలని ‘సుప్రీంకోర్టు ఇచ్చిన సంచలన ఆదేశాల’ నేపథ్యంలో .. సుప్రీం కోర్టులో వైసీపీ నేతలు అభ్యన్తరాలు వ్యక్తం చేసిన మొత్తం 19 మున్సిపాలిటీ లలో నామినేషన్స్ గడువు పెంచడానికి సుప్రీం కోర్ట్ ఆదేశాలు పాటించాలని.. , అక్కడ జరిగిన అల్లర్ల ఆధారాలు కూడా శరవేగంగా తమకు పంపాలని కోరుతూ ఉన్నతాధికారులతో రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా నేడు బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ నుంచి వచ్చిన ఫిర్యాదులు, ఆధారాలతోపాటు వాటిపై తీసుకున్న చర్యల గురించి ఆయా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ఎన్నికల కమిషనర్ అడిగి తెలుసుకొన్నారు.. సుప్రీంకోర్టు లో స్థానిక సంస్థల ఎన్నికలపై ఈనెల 27న మరోసారి విచారణ ఉన్న దృష్ట్యా .. మరో వైపు ఈ అంశంపై సుప్రీంకోర్టు కు సమర్పించవలసిన ఆధారాలపై ఏపీ ప్రభుత్వ స్టాండింగ్ కౌన్సిల్, రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్‌తో ఎస్ఈసీ చర్చించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *