సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సుమారు ఏడాది కాలంగా అంచెలు అంచెలుగా నిర్మాణం లో ఉండి ఎట్టకేలకు 3 కోట్ల 65 లక్షల రూపాయలతో గత నెలలో పూర్తీ అయ్యిన.. ఉండి రోడ్ నుండి బైపాస్ రోడ్డు ను కలుపుతూ బీవీ రాజు విగ్రహం చౌరస్తా వరకు కలుపుతూ నిర్మించిన ( బైపాస్ రోడ్డు జడ్డు బ్రహ్మాజీ కళ్యాణ మండపం వద్ద నుండి బి.వి.రాజు బొమ్మ వరకు) సీసీ మరియు బీటీ రోడ్ ను ను నేడు, మంగళవారం స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అధికారికంగా ప్రారంభోత్సవం చేసారు. ( ఈ రోడ్డు నిర్మాణం పూర్తీ కావాలనే మన సిగ్మా న్యూస్ తరుచు.. సగం సగం పనులు పేరుతొ ఐటమ్స్ వేసేది. పూర్తీ చెయ్యడానికి కారకులయిన ప్రతి ఒక్కరికి అభినందనలు ) ఈ కార్యక్రమం లో ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాద్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. తదుపరి …CSR ఫండ్స్ నిధులు క్రింద లైన్స్ క్లబ్ వారితో కలసి 20 లక్షల రూపాయలతో బైపాస్ రోడ్ లో క్లాక్ టవర్, పోలీస్ అవుట్ పోస్ట్ మరియు కంట్రోల్ ఫ్లడ్ లైటింగ్ నిర్మాణానికి ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ శంకుస్థాపన చేసారు. తదుపరి జేపీ రోడ్డు అల్లూరి సీతారామ రాజు నగర్ జేపీ రోడ్డు ను అనుకోని ఉన్న సర్ అర్ధోర్ కాటన్ పార్క్ ను మరింత సుందరీకరణ చెయ్యడం కోసం కాస్మోపాలిటన్ క్లబ్ వారి25 లక్షల రూపాయలతో ముందుకు రావడంతో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తో కలసి ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ , మున్సిపల్ కమిషనర్ శివరామ కృష్ణ, పలువురు వైసిపి నేతలు శంకుస్థాపన కార్యక్రమం లో పాల్గొన్నారు.
