సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్ : అమెరికా అడ్జక్షుడు ట్రంప్ నిర్ణయాలతో ఎక్కువ ప్రభావితం అయిన భారత్ తన చిరకాల మిత్రులు రష్యా, ఇరాన్ లకు కాస్త దూరంగా జరిగి.. దేశంలో తొలిసారి తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకుంటున్నా నేపథ్యంలో .. అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో నేడు,శనివారం కోల్‌కతాకు చేరుకున్నారు.అక్కడ మదర్ దెరిసా సమాది ని సందర్శించి నివాళ్లు అర్పించారు.నేటి నుంచీ నాలుగు రోజుల పాటు ఆయన భారత్‌లో పర్యటించనున్నారు. 2012లో అప్పటి విదేశాంగ శాఖ మంత్రి హిల్లరీ క్లింటన్ భారత్‌లో పర్యటించారు. ఆ తరువాత దాదాపు 14 ఏళ్ల తరువాత మరోసారి యూఎస్ విదేశాంగ మంత్రి భారత్‌కు వచ్చారు. వాణిజ్యం, టెక్నాలజీ, రక్షణ రంగం, క్వాడ్ కూటమి తదితర విషయాలపై భారత్‌తో చర్చలు జరిపేందుకు మంత్రి రూబియో భారత్‌కు వచ్చారు. మంత్రి రూబియో త్వరలో ప్రధాని మోదీతో సమావేశమవుతారు.
