సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలోని శివారు ప్రాంతమైన పులిగుమ్మలో రూ. 41.81 లక్షలు వ్యయంతో 40,000 లీటర్ల సామర్ధ్యం కలిగిన ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులకు నేడు, బుధవారం ఉదయం శాసనసభ డిప్యూటీ స్పీకర్ మరియు ఉండి ఎమ్మెల్యే రఘురామా కృష్ణంరాజు పూజ కార్యక్రమాలతో శంకుస్థాపన చేసారు. ఈ సందర్భముగా ఆయన మాట్లాడుతూ.. ఉండి నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి పరిశుభ్రమైన త్రాగునీరు ,పొలాలలో ప్రతి ఎకరాకు కాలుష్యం లేని నీరు అందించి రైతులను ఆదుకోవాలనే తన లక్ష్య సాధన లో ఎన్ని అడ్డంకులు వచ్చిన వాటిని అధిగమించి ఒక ప్రజా ప్రతినిధి ప్రజలకు కనీస అవసరాలు తీర్చడానికి ఎంతగా శ్రమించాలో, ఎంత పారదర్సకంగా పని చెయ్యాలో, అభివృద్ధి కి నిధులు ఎలా సమకూర్చాలో చేతలలో చేసి చుపిస్తున్నానని, అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక పెద్దలు ప్రజలు కూటమి నేతలు పాల్గొన్నారు.
