శ్రీమావుళ్ళమ్మ అన్న ప్రసాద వితరణకు ఛాంబర్ పరిశీలన

  • భక్తులకు మెరుగైన సౌకర్యాలు, అన్న ప్రసాద వితరణకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలి
  • ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు, దేవస్థాన సభ్యులతో ఎమ్మెల్యే అంజిబాబు సమీక్ష

భీమవరం ;
రాష్ట్రంలోనే పేరుగాంచిన భీమవరం శ్రీమావుళ్ళమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు ఇతర ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తున్నారని, వారికి అన్న ప్రసాదాన్ని అందించడానికి వీలైనంత విశాలమైన స్థలం అందుబాటులో ఉండాలని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు. శ్రీమావుళ్ళమ్మ దేవస్థానంకు దగ్గర ఉన్నా ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనాన్ని శనివారం ఎమ్మెల్యే అంజిబాబు దేవస్థానం సభ్యులు, ఛాంబర్ సభ్యులతో కలిసి పరిశీలించారు. ప్రస్తుతం ఇటీవలే లీజుకు తీసుకున్న 9 సెంట్ల స్థలంలో ప్రతిరోజు 200 నుంచి 300 మంది భక్తులకు భోజనం అందిస్తున్నామని, కొద్దిగా విశాలమైన స్థలం ఉంటే భక్తులకు ఇబ్బందులు లేకుండా ఉండవచ్చని వారు ఎమ్మెల్యే అంజిబాబు కు తెలిపారు. దీనిపై ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ భక్తులకు మెరుగైన సౌకర్యాలు, అన్న ప్రసాద వితరణకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. రానున్న రోజుల్లో అమ్మవారిని చూసేందుకు వేలల్లో భక్తులు తరలిరానున్నారని, దాని దృష్ట్యా ఇప్పటి నుంచే అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *