సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో ఏ ఎన్నికలు జరిగిన తెలుగు రాష్ట్రాలలో అందరికి గుర్తుకు వచ్చే వ్యక్తి ‘గ్రంధి శ్రీనివాస్’. లక్ష్యం కష్టమైన ‘ఏటికి ఎదురు ఈదే’ మంచి దమ్మున్న మాస్ లీడర్ ., భీమవరంలో ‘ గ్రంధి’ కుటుంబానికి రాజకీయ మూలాలు కు బలమైన శక్తిగా నిలబడినవారు ఆయన తండ్రి స్వర్గీయ గ్రంధి వెంకటేశ్వర రావు, 4 దశాబ్దాల క్రితం తెలుగు దేశం పార్టీ పశ్చిమ గోదావరి జిల్లాలో ఏకఛత్రాధిపత్యంగా ఏలుతున్న రోజులలోనే ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున భీమవరం మునిసిపల్ చైర్మెన్ గా ప్రత్యక్ష ఎన్నికలలో ఏకంగా 10వేల ఓట్ల మెజారిటీ తో గెలచి తెలుగు దేశాన్ని కూడా ఓడించవచ్చు అని మొదటగా నిరూపించిన వ్యక్తి గా గ్రంధి వెంకటేశ్వర రావు, చరిత్ర సృష్టించారు. తదుపరి 2004 లో గ్రంధి శ్రీనివాస్ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా మొదటి సారి పోటీ చేసి అప్పటికే 4సార్లు ఎమ్మెల్యే గా గెలిచిన టీడీపీ ఎమ్మెల్యే పెన్మెత్స నరసింహరాజు ఫై 7వేల ఓట్ల పైగా మెజారిటీ సాధించి సంచలనం రేపారు. తదుపరి జరిగిన పరిణామాలలో 2009 లో చిరంజీవి ‘ప్రజారాజ్యం ఎమ్మెల్యే టికెట్ సాధించిన కనకరాజు సూరికి మద్దతుగా నిలిచారు.. గ్రంధి శ్రీనివాస్ మరల కాంగ్రెస్ పార్టీ తరపున 2014 లో పోటీ చేసి 12 వేల ఓట్ల తేడాతో పరాజయం పొందినప్పటికీ 2019 లో జరిగిన ఎన్నికలలో జగన్ హయాంలోని వైసీపీ పార్టీ అభ్యర్థిగా ఏకంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ( అంజిబాబు కూడా ఓటమి) 8వేల ఓట్ల మెజారిటీ తో ఓడించి దేశంలో సంచలనం రేపారు. తదుపరి 2024 లో జనసేన అంజిబాబు చేతిలో ఓటమి పొందారు. తదుపరి వైసీపీ కి రాజీనామా చేసి రాజకీయాలకు పూర్తీ దూరంగా ఉండటం జరిగింది. మరి ఇప్పుడు మునిసిపల్ ఎన్నికలు సమయంలో గ్రంధి లేని లోటు ప్రజలకు అన్ని పార్టీల క్యాడర్ కు స్వష్టంగా కనిపిస్తుంది. ఎన్నికల ‘కిక్’ ఎవరికీ రావడం లేదు..అయితే ప్రస్తుత ఎన్నికలలో ‘గ్రంధి’మద్దతు దారులు కూటమి, వైసీపీ పార్టీలలో మరియు ‘స్వతంత్ర‘ కౌన్సెలర్స్ అభ్యర్థులుగా ఎన్నికల బరిలో విశేషంగా ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో కూటమి చైర్ పర్సన్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ చుండూరి మల్లేశ్వరి నేడు, మంగళవారం మెంటేవారి తోట బై పాస్ లోని గ్రంధి శ్రీనివాస్ నివాసం కు వెళ్లి మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ( ఫై తాజా చిత్రంలో).

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *