సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: మెగాస్టార్ కాకముందు చిరంజీవి పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు గ్రామంలో నివాసం ఉంటూ నర్సాపురంలో వైఎన్ఎం కళాశాలలో చదువుకున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆనాటి విద్యార్థులు 65 దాటి 70 వడికి చేరుకొంటున్న నేపథ్యంలో హైదరాబాద్ మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో నేటి ఆదివారం నిర్వహించిన గేట్ టూ గెదర్.. ఆత్మీయ సమ్మెళన కార్యక్రమంలో మిత్రులు అందరు పాల్గొని ఆనాటి మధుర జ్ణాపకాలు గుర్తుకుతెచ్చుకొన్నారు. చిరంజీవిని మిత్రులు సన్మానించారు. ఈ సందర్భముగా చిరంజీవి మాట్లాడుతూ.. వైఎన్ఎం కళాశాలలో నాకు ఎన్నో మధుర జ్ఞాపకాలున్నాయన్నారు. పూర్వ విద్యా ర్థుల ఆత్మీయ సమావేశం నిర్వహించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఆ కళాశాలలో క్రమశిక్షణ నేర్చుకున్నానని, అక్క్కడ పాఠాలు కాదు..జీవితాలు ఎలా చదవాలో నేర్చుకున్నాని, అదే స్పూర్తితో సినిమాలలో రాణించానని, అయితే రాజకీయాల్లో మాఇమడలేకపోయానని అన్నారు, రాజకీయాల్లోఉన్నప్పుడు కఠినంగా ఉండాలని, అది తనవల్ల కాలేదని, ఒక దశలో తనకు రాజకీయాలు అవసరమా? అనిపించిందని ఆయన వ్యాఖ్యానించారు.
