సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: మరో సారి టమోటా ధర దారుణంగా మార్కెట్ లో కేజీ 10 -15 రూపాయలకు పడిపోయింది. టమోటా రైతులకు ఈసారి సీజన్ మొదటిలోనే దెబ్బ పడింది. పంట చేతికొచ్చిన సమయంలో ధరల పతనం రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. అనంతపురం తో పాటు రాయలసీమా జిల్లాలలో కష్టపడి పండించిన పంటను మార్కెట్‌కు తీసుకెళ్లినా ప్రయోజనం లేక పంటను తోటలోనే వదిలేయడం, లేదంటే రోడ్లపక్క పారబోసే దృశ్యాలు మరలా కనిపిస్తున్నాయి. మే, జూన్‌లో ఎండలతో ప్రతికూల పరిస్థితులు ఉన్నా పంటను రక్షించుకొన్న రైతులకు రేటు బాగానే కిట్టుబాటు అయింది. అయితే ఈ వర్షాకాలం .సీజన్‌ ప్రారంభంలోనే పంట మార్కెట్‌కు తరలిస్తే మంచి ధర వస్తుందని భావించిన రైతులకు పెద్ద షాక్ తగిలింది. 16 కిలోల టమోటా బాక్స్‌ మొన్నటివరకు రూ. 200 ధర ఉండేది. ఇప్పుడు చాలా తగ్గిపోయింది. క్వాలిటీ బట్టి రూ.140తోనుండి రూ.80తో మాత్రమే అమ్ముడుపోయాయి.. దిగుబడి బాగా ఉన్నా.. ధరల పతనంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *