సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: ఎన్టీఆర్ జిల్లాలో బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహణకు ముందు చంద్రబాబు జిల్లాకు చెందిన టీడీపీ ప్రజాప్రతినిధులు ఎంపీ కేశినేని నాని, గద్దె రామ్మోహన్, వర్ల రామయ్య, నెట్టెం రఘురాం , బుద్దా వెంకన్న తదితర సీనియర్లతో మంగళగిరిలోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో చంద్రబాబు భేటీ అయ్యారు. దానిలో భాగంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ‘జిల్లాలో పార్టీని ఇంకా ప్రతిష్ఠపరచాలి. ఇక్కడ అంతర్గత కుమ్ము లాటలతో నష్టం జరుగుతోంది. ఎంత చెప్పినా మీలో మార్పు రావడం లేదు’అంటూ ఆగ్రహం వ్యక్తం చెయ్యడంతో అక్కడ ఉన్న ఎంపీ కేసనేని నాని కూడా అదేస్థాయిలో చంద్రబాబు తో నన్ను దృష్టిలో పెట్టుకునే మీరు మాట్లాడుతున్నట్లు ఉంది. నా వల్ల పార్టీలో ఎలాంటి ఇబ్బందులు లేవు. ఎవరితోనూ నేనేమీ తగాదాలు పెట్టుకోవడం లేదు. ఎవరి మధ్యా గొడవలు పెట్టడం లేదు. ఈ పార్టీ మీ కంపెనీ. దీనికి మీరు ఓనర్. అలాగే, కేశినేని కంపెనీకి నేను ఓనర్ని. నా ఇష్ట ప్రకారం నా కంపెనీ నడుస్తుంది. పార్టీలో మీరు చెప్పిందే జరుగుతుంది. ఆ తరువాత మీ వారసులు చెప్పింది నడస్తుంది’ అంటూ ధ్వజం ఎత్తడంతో చంద్రబాబు సహా అక్కడున్న నాయకులు అవాక్కయ్యారని వార్త సమాచారం. కాసేపటికి తేరుకున్న బాబు.. ‘నానీ అసలు నువ్వేం మాట్లాడుతున్నావు. నీకేమైనా తెలుస్తోందా? కంపెనీ ఏంటి? వారసులేంటి?’ నిత్యం కష్టపడితేనే పార్టీని నడపగలం.. ఇకపై ఎవరినైనా సరే నేను ఉపేక్షిం చను. పార్టీలో ఉండేవాళ్లు ఉండండి. వెళ్లిపోయేవాళ్లు పోండి’ అని చం ద్రబాబు ఆగ్రహంతో అనడంతో,, ‘ఓకే సార్. థాంక్స్ . మీరు టికెట్ ఇచ్చారు. రెండుసార్లూ గెలిచాను. అయితే ఇక మీ వారసత్వంతో నేను పనిచేయలేనులెండి. నాకు హైదరాబాద్, ఢిల్లీలో ఆఫీసులు ఉన్నాయి. అక్కడికెళ్లి నా పనేదో నేను చూసుకుం టాను. ఇక్క డ (విజయవాడ) కూడా మీరు ఎవరినో ఆల్రెడీ చూసుకుంటున్నారుగా. అలాగే కానివ్వండి. ఎంకరేజ్చేయండి’ అం టూఅని కేశినేని నాని వ్యాఖ్యనించడంతో మిగతా సభ్యులు సమన్వయపరిచారని సమాచారం.
.
