సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం స్థానిక బి.వి.రాజు కళాశాలలో నేడు, శుక్రవారం ట్రాఫిక్ పోలీస్ ,RTO, భీమవరం వారి సహాయంతో NSS UNITS ఆధ్వర్యంలో డ్రైవింగ్ లైసెన్స్ మేళా జరిగింది. దీనిలో సుమారుగా 200 మందికి పైగా డ్రైవింగ్ లైసెన్స్ (LLR) స్లాట్ బుకింగ్ జరిగింది. ఈ కార్యక్రమానికి M.V.I. అధికారి K.S.N ప్రసాద్ , ట్రాఫిక్ సి ఐ దాస్, ఎస్ ఐ మోహన్ , కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్ కే రాజు,NSS అధికారులు మరియు వాలంటీర్స్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ట్రాఫిక్ పోలీసులు వాలంటీర్స్ కి రోడ్ భద్రత, ప్రయాణ జాగర్తలు మరియు వాహనాలు నడిపే విద్యార్థులు అందరు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలని దాని ప్రాముఖ్యత ను తెలిపారు. ఈ కార్య్రమాన్ని నిర్వహించినందుకు కళాశాల ప్రిన్సిపాల్ అధికారుల ని ట్రాఫిక్ పోలీస్ సిబ్బందిని అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *