సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో భాగంగా గోదావరి జిల్లాల పర్యటన చివరి రోజున గత శుక్రవారం రాత్రి పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం, అంతకుముందు నిడదవోలు, తణుకు లో జరిగిన భారీ సభల్లో ఆయన ప్రసంగించారు. తాడేపల్లి గూడెంలో చంద్రబాబు రోడ్ షోలో మాట్లాడుతూ.. ‘ఇంత నీచమైన ముఖ్యమంత్రిని నా రాజకీయ జీవితంలో ఎప్పుడూ చూడలేదు.ఈ సైకో వల్ల పెట్టుబడిదారులు పారిపోతున్నారు. అమరరాజా బ్యాటరీస్‌ రూ.9500 కోట్లు పెట్టుబడులు ఆంధ్రలో పెట్టకుండా తెలంగాణలో పెట్టడానికి అగ్రిమెంటు చేసుకున్నారు. ఇక ఉద్యోగాలు ఎలా వస్తాయి’ అని ఆయన ప్రశ్నించారు. ఆ పరిశ్రమకు జగన్ తండ్రి మాజీ సీఎం రాజశేఖరరెడ్డి భూములిస్తే ఆయన కొడుకు వచ్చి కబ్జా చేస్తున్నాడని ఆరోపించారు. ప్రస్తుత పరిస్థితిని చూస్తే కడుపు మండిపోతోంది. ఇక్కడ పుట్టిన వ్యక్తి ఇక్కడ పరిశ్రమ పెట్టలేని పరిస్థితి దాపురిస్తే బాధ అనిపిస్తుంది. 5 కోట్ల మందిని అడుగుతున్నాను మీకు బాధ అనిపిస్తుందా లేదా? ఇటువంటి వ్యక్తి ఉంటే ఇక మీ పిల్లలను చదివించుకోవడం ఎందుకు’ అని ప్రశ్నించారు. సైకో సీఎం చేతిలో రాష్ట్రం నాశనమైపోతోందని.. దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనాఉందని తీవ్ర వ్యాఖ్యలు చేసారు. వచ్చే ఎన్నికల్లో జగన్‌ మళ్లీ గెలిస్తే మనమెవరం ఇక్కడ ఉండనవసరం లేదు. పారిపోవలసిందే. మా కులం, మా పార్టీ, మా ప్రాంతం అని ఆలోచిస్తే మీ పని గోవిందా. దేవుడూ కాపాడలేడు. గతంలో నేను వేసిన రోడ్లపై పాదయాత్ర చేశావు. ఇప్పుడు వాటిని గుంతలుగా మార్చావు. 3 రాజధానులు అభివృద్ధి వికేంద్రీకరణ కు అడ్డుపడుతున్న చంద్రబాబు గో బ్యాక్ అంటూ భారీ నిరసన బ్యానర్స్ తో వైసిపి శ్రేణులు నిరసన తెలపడంపై చంద్రబాబు ఆగ్రహంతో.. సీఎం గిల్లుతుంటే తాడేపల్లిగూడెంలో చిలక్కొట్టుడు సత్యనారాయణ నన్ను విమర్శిస్తున్నాడు. వైసీపీ శ్రేణులు ఆయన మాటలు నమ్మి మోసపోకండి.. ఇక వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనని తెలుసుకోండి.అని పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *