సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గతంలో సుమారు దశాబ్దాల క్రిందట ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా లో చేపట్టిన చేపట్టిన గోదావరి డెల్టా ఆధునికీకరణ పనులు కోసం రూ.3,300 కోట్లు విడుదల చేయగా వాటిలో రూ.1700 కోట్ల విలువైన పనులు మాత్రమే జరిగాయి. అప్పట్లో మిగిలిన రూ.1600 కోట్లకు మరో రూ.400 కోట్లు కలపి మొత్తం 2వేల కోట్ల బడ్జెట్ తో డెల్టా ఆధునికీకరణ పనులు కోసం కొన్ని పెండింగ్ పనులు తో పాటు కొత్త పనులకు ప్రతిపాదనలు పంపడానికి జిల్లా కేంద్రం భీమవరంలో జలవనరుల శాఖ అధికారులు సిద్ధమౌతున్నారు. వంతెనలు తప్ప మిగిలిన పనులన్నీ కొత్త ప్రతిపాదనల్లో చేర్చేలా చూడాలని సంబంధిత అధికారులు గత, శనివారం జరిగిన సాగునీటి పారుదల కమిటీ సమావేశంలో సమీక్షించారు. భీమవరం యనమదుర్రు డ్రెయిన్ మొదలుకొని స్లూయిస్ తలుపులు, లాక్ ఛాంబర్ మరమ్మతులు యనమదురు , ఉప్పుటేరు డ్రెయిన్లు నీరు మరింత వేగంగా సముద్రం లో కలిసేచోట పూడిక తీసి మరింత లోతు చేయడం పంట, మురుగుకాలువల వెంబడి రక్షణ గోడల నిర్మాణము వంటి ప్రతిపాదనలు అనుమతుల కోసం సిద్ధం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *