సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు ఏపీలోని అన్ని నియోజకవర్గాల నేతలతో ఆన్‌లైన్‌లో సమావేశాలు నిర్వహించారు. దానిలో భాగంగా పార్టీ క్యాడర్ నుద్దేశించి.. జగన్‌రెడ్డికి ఓటమి భయం పట్టుకొంది. దీనితో ముందస్తు ఎన్నికల ఆలోచన కూడా చేస్తున్నారు’’ అని వ్యాఖ్యానించారు. ఇదేం ఖర్మ కార్యక్రమ నిర్వహణపై క్యాడర్ శ్రద్ద పెట్టాలని, ప్రజల నుండి మంచి స్వాందన వస్తుందన్నారు. ‘‘ ప్రజల నుండి రోజురోజుకి వ్యతిరేకత పెరుగుతోందన్న విషయం అర్థమయ్యేసరికి ఎన్నికల విషయంలో జగన్‌రెడ్డి ఆలోచన చేస్తున్నారు. వచ్చే మే నెలలో ఎన్నికలకు వెళ్లాలా? అక్టోబరులో వెళ్లాలా? లేక షెడ్యూల్ ప్రకారం 2024లో వెళ్లాలా? అన్నదానిపై తర్జనభర్జన పడుతున్నారు. 175 సీట్ల నుంచి ఇప్పుడు ఏ సమయంలో ఎన్నికలకు వెళ్తే గెలుస్తాం అని లెక్కలు వేసుకొనే స్థితికి వైసిపి దిగజారిపోయారు. ఈసారి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా నూటికి వెయ్యి శాతం వైసీపీ చిత్తుగా ఓడిపోవడం ఖాయం. లబ్ధిదారుల లిస్టులో తొలగించడంతో ఏ సంక్షేమ పధకం అందక మధ్యతరగతి ప్రజలు ప్రభుత్వానికి పూర్తిగా దూరమయ్యారు, ఖజానా ఖాళీ అయ్యింది. ఇప్పుడు 13వ తేదీ వచ్చినా ఉద్యోగులు అందరికీ జీతాలు చెల్లించలేకపోయారు. ఇటువంటి పరిస్థితి గతంలో ఎన్నడూ లేదు. వైసిపి పాలన లొసుగులు అన్ని’ ఇదేం ఖర్మ’కార్యక్రమంలో ప్రజలకు వివరించాలి’’ అని చంద్రబాబు నేతలకు ఉద్బోధ చేసారు.
