సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్ : గత గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ఏపీ క్యాబినెట్ మంత్రిమండలి సమావేశంలో జిల్లా ప్రజల ఎదురు చూస్తున్న భీమవరం కు అర్బన్ డవలప్మెంట్ అథారిటీకి ఆమోదం తెలపడం ఫై మన ‘సిగ్మా న్యూస్’ మొదటగా సమాచారం ఇవ్వడంతో జిల్లా వ్యాప్తంగా హర్షం వ్యక్తం అవుతుంది. ప్రస్తుతం జిల్లాలోని అన్ని పట్టణాలు, గ్రామ పంచాయతీలు ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ఈడా)లో ఉన్నాయి. ఇప్పటిదాకా లేఅవుట్లు, భవన నిర్మాణాల అనుమతులను ఈడా ఏలూరులోనే మంజూరు చేస్తోంది. గ్రామ పంచాయతీల్లో లేఅవుట్లకు ఈడా అనుమతిస్తోంది. అందుకు సంబంధించిన రుసుము అంతా ఈడా ఖాతాలోనే జమ అవుతున్నాయి. ఇకపై వీటికి సంబందించిన అనుమతులు ప్రభుత్వం కొత్తగా ఆమోదించిన భీమవరం అర్బన్ డవలప్మెంట్ అథారిటీ లో లభిస్తాయి. ఇటీవలే పశ్చిమ గోదావరి జిల్లాలోని మున్సిపాలిటీలకు దాదాపు రూ.48 కోట్లు మేర నిధులను పంపిణీ చేశారు. ఐదంతుస్తుల అపార్ట్మెంట్ అనుమతులను మున్సిపాలిటీలకే అప్పగించారు. కానీ పట్టణాలకు ఆనుకుని ఉన్న పంచాయతీల్లో వ్యక్తిగత నిర్మాణాలు, అపార్ట్మెంట్లకు ఈడా అనుమతి తప్పనిసరి. ఇప్పటికీ ఏలూరు కార్యాలయం నుండి పంచాయతీలకు సంబంధిత నిధులు ఇవ్వలేదు. ఇప్పటికే భీమవరం మున్సిపాలిటీ ప్రాజెక్ట్ నివేదికను పంపింది. భీమవరంలో నూతన కార్యాలయానికి చైర్మన్తో పాటు, అధికారి, 8 మంది సిబ్బందితో పాటు నిర్వహణ ఖర్చులకు ఏటా రూ.1.10 కోట్లు అవసరం అవుతాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆ ఏర్పట్లు కూడా శరవేగంగా చేస్తే జిల్లాకు మేలు చేసినవారు అవుతారు.
