సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: తాజగా నేడు, శుక్రవారం టాలీవుడ్ డ్రగ్స్ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ప్రముఖ సినీనటి రకుల్ ప్రీత్ సింగ్ కు ఎన్ఫోర్స్మెం ట్ డైరెక్టరేట్ (ఈడీ)నోటీసులు జారీ చేసింది. గతంలోనూ డ్రగ్స్ కేసులో గతేడాది సెప్టెంబర్ 3న రకుల్‌ను ఈడీ అధికారులు విచారించారు. మరల చాల కాలం తరువాత మరోసారి విచారణకు హాజరుకావాలని తాజాగా ఈడీ అధికారులు రకుల్‌కు నోటీసులు జారీ చేశారు. గతంలో హైదరాబాద్ లో తెలుగు సినీ ప్రముఖుల డ్రగ్స్ వ్యవహారంపై 2017 జులైలో ఎన్డీపీఎస్ చట్టం కింద తెలంగాణ ఎక్సైజ్ పోలీసులు కేసు నమోదు చేశారు. సిట్ ఏర్పా టు చేసి పలువురు సినీ ప్రముఖులును విచారించారు. గతేడాది మనీలాండరింగ్ కింద ఈ కేసులో ఈడీ అధికారులు విచారణ చేపట్టారు. ప్రస్తుతం లైగర్ సినిమాకు నిధులు విదేశాల నుండి వచాయి అన్న కేసులో . ఈడీ విచారణకు పూరీ జగన్నాథ్, రవితేజ, ఛార్మి హాజరు అవుతున్న విషయం .. వీరు గతంలో డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కొన్న విషయం విదితమే..
