సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలోని ప్రముఖ విద్యా సంస్థ శ్రీ విష్ణు మహిళా ఇంజనీరింగ్ కళాశాలకు ఇంజనీరింగ్ విద్యలో ఉన్నత ప్రమాణాలు సాధించినందుకుగాను “ఉమెన్ ఇంజనీరింగ్ కాలేజీ” విభాగంలో ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ యాక్సలెన్స్ అవార్డు – 2022 అందుకున్నదని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ G. శ్రీనివాసరావు తెలియజేసారు. . ఈ అవార్డును చెన్నై నగరంలో ది ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ (ఇండియా) నిర్వహించిన 37వ ఇండియన్ ఇంజనీరింగ్ కాంగ్రెసులో తమిళనాడు విద్యాశాఖ మంత్రి అన్బిల్ మహేష్ పోయమొళి చేతుల మీదగా శ్రీ విష్ణు మహిళా ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ G. శ్రీనివాసరావు, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ P. శ్రీనివాస రాజు మరియు కళాశాల డీన్ డాక్టర్ V.V.R మహేశ్వర రావు సంయుక్తంగా అందుకున్నారు.
