సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: పల్నా డు జిల్లా మాచర్లలో గత శుక్రవారం రాత్రి నుండి టీడీపీ వైసిపి ఇరు పక్షాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నివురుగప్పి న నిప్పు లా మారాయి. ఈ రోజు పట్టణంలో దుకాణాలు మూసివేయించి పోలీసులు పరిస్థితి అదుపులో పెట్టినప్పటికీ ఏ క్షణాన ఏం జరుగుతుం దోనని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. గత రాత్రి తెలుగు దేశం వర్గాలు ఇదేం ఖర్మ .. కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నప్పుడు అక్కడే ఉన్న వైసిపి నేతలకు వారికీ మధ్య వాగ్వాదం జరిగిందని తరువాత ప్రముఖ టీడీపీ నేత బ్రహ్మారెడ్డి గృహదహనం, టీడీపీ మద్దతు దారుల ఇళ్లపై పడివిద్వంసం జరగడంతో తో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆ గృహదహనం తాము చెయ్యలేదని గతంలో టీడీపీ నేతకు ఉన్న ఫ్యాక్షన్ కక్షలు నేపథ్యంలో ఎవరోరాత్రి ఘటనను అదనుగా చేసిన పని వైసిపి వర్గాలు ఖండిస్తుండగా పోలీసులు కూడా ఇదే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తాజా పరిణామాలతో పరిణామాలతో మాచర్ల పట్టణం లో 144 సెక్షన్ కొనసాగుతోంది. భారీగా పోలీసులను మోహరించి కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు. వైసిపి శ్రేణుల విధ్వంసకాండ చేసారని టీడీపీ వర్గాలు పెద్ద ఎత్తున నిరసిస్తూ ‘చలో నరసరావుపేట’ పేరుతో ర్యాలీ కి బయల్దేరగా పోలీసులు ఎక్క డికక్కడ అడ్డుకున్నారు. పలువురు నేతలను మాజీ టీడీపీ మంత్రులను ఎక్క డికక్కడ గృహనిర్బంధం చేశారు. దీంతో పలుచోట్ల పోలీసులు, తెదేపా నేతల మధ్య స్వల్ప తోపులాట చోటుచేసుకుంది.
