సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: జాతీయ రహదారి 165 విస్తరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో కైకలూరు మండలం పల్లెవాడ పెట్రోలు బంకు సమీపం లో జాతీయ రహదారిపై గత, శుక్రవారం రాత్రి ఆలపాడు పెట్రోలుబంకుకు వస్తున్న ఆయిల్ ట్యాంకర్ను ఆకివీడు నుంచి కైకలూరు వైపు వెళ్తున్న గుర్తుతెలియని వాహనం ఎదురుగా ఢీకొట్టింది. ఈఘటనలో ట్యాంకర్ బోల్తా కొట్టగా.. డ్రైవర్ కు స్వల్ప గాయాలయ్యాయి. అతన్ని వెంటనే 108 వాహనం పై కైకలూరు ప్రభుత్వా సుపత్రికి తరలించారు. ట్యాంకర్ కొంతమేర పగిలిపోవడంతో ఆయిల్ రోడ్డంతా వ్యాపించింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని ట్యాంకర్ ను పూర్తిగా నీటితో తడుపుతూ మరో వైపు క్రేను సహాయంతో ప్రాణాలకు తెగించి నేటి శనివారం తెల్లవారు జాముకు దానిని యధాతధంగా నిలబెట్టారు. సహాయక చర్యలు చేపట్టారు. అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉన్నందున రోడ్డుకిరువైపులా కి.మీ.మేర వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో దాని అనుబంధంగా వాహనాల మల్లింపుకు సుమారు 50 మీటర్ల మేర చిన్న మార్గం ఏర్పాటు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *