సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి ఉమ్మడి జిల్లాల ప్రధాన జిల్లా జడ్జి , ఏలూరు వారి ఆదేశాల మేరకు భీమవరం సీనియర్ సివిల్ జడ్జి బి. అప్పల స్వామి నేటి శనివారం ఉదయం భీమవరం మీడియా వారితో సమావేశంలో జడ్జి మాట్లాడుతూ.. 2022 లో జరిగిన 4 జాతీయ లోక్ అదాలత్ ల ద్వారా 832 ఆయా కోర్టులలో పెండింగ్ లో ఉన్న క్రిమినల్, సివిల్ మనోవర్తి కేసులను,1112 ప్రీ లిటిగేషన్ కేసులను ఉభయ పార్టీల సమక్షంలో రాజీ జరిగాయన్నారు. ఇన్ని కేసులు రాజీ చేయడానికి స్థానిక మీడియాసహకారం ఎంతగానో ఉందని కృతజ్ఞతలు తెలిపారు. . అదేవిధంగా 2023 లో నిర్వహించే 4 జాతీయ లోక్ అదాలత్ ల తేదీలు ప్రకటించారు. (ది. 11.2.2023, 13.5.2023, 9.9.2023 మరియు 9.12.2023) జరుగనున్న జాతీయ లోక్ అదాలత్ ల ద్వారా కూడా పలు ఎక్కువ కేసులు రాజీ చేయడానికి అందరు సహకరించాలని మరియు కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియచేసినారు. పారా లీగల్ వాలంటీర్లు ద్వారా కూడా అన్ని గ్రామాలలో జాతీయ లోక్ అదాలత్ యొక్క ప్రాముఖ్యతను ప్రచారం చేస్తున్నారన్నారు. . ఈ సమావేశంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీమతి D. సోని, 1వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి A. పవన్ కుమార్, 2వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి D. ధన రాజు మరియు బార్ అసోసియేషన్ కార్యదర్శి S.V సత్యనారాయణ , న్యాయవాదులు M. శివ కృష్ణ, P. అంబేడ్కర్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *