సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం లో కొనసాగుతున్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ సోమువీర్రాజు పర్యటన నేడు, ఆదివారం కూడా కొనసాగింది. ఉదయం 11గం. లకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మనసు లో మాట కార్యక్రమం లో పాల్గొన నున్న సోమువీర్రాజు భీమవరం లో నిర్వహించిన మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి జయంతి కార్యక్రమంలో పాల్గొని ఘన నివాళ్లు అర్పించారు. ఈసందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ.. వాయిపేయ్ భారత జాతికి గొప్ప దార్శనికుడు అని , రచయిత ఎంతో దమ్ముగా పోఖ్రాన్ అణు పరీక్షలు నిర్వహించి భారత సత్తా శత్రు దేశాలకు చాటిన ధీరుడు వాజపేయి అని కీర్తించారు. తనకు వాజపేయి తో ఉన్న అనుబంధాన్ని సోము వీర్రాజు ఈసందర్భంగా గుర్తు చేసుకున్నారు
