`సిగ్మా తెలుగు డాట్ ఇన్, న్యూస్: సీఎం జగన్ నేడు, మంగళవారం తన పుట్టిన రోజు వేడుకలను పశ్చిమ గోదావరి జిల్లా వైసీపీ నేతల సమక్షంలో జరుపుకొన్నారు.. ఈ నేపథ్యంలో.. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణానికి ఉదయం 11.27 ని.లకు విచ్చేసారు. రాష్ట్ర ముఖ్యమంత్రికి, రాష్ట్ర మంత్రులు అధికారులు ప్రజాప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు. ముందుగా ఉప ముఖ్యమంత్రులు ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్, ధర్మాన కృష్ణదాస్ , శాసన మండలి చైర్మన్, మోషేన్ రాజు, ముఖ్యమంత్రికి పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర మంత్రులు చెరుకువాడ శ్రీరంగనాథరాజు, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ శ్రీమతి తానేటి వనిత, పార్లమెంటు సభ్యులు కోటగిరి శ్రీధర్, జిల్లా పరిషత్ చైర్మన్ కవురు శ్రీనివాస్, జిల్లాలోని.. తణుకు శాసనసభ్యులు కారుమూరి వెంకట నాగేశ్వరరావు, భీమవరంఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఇంకా, ఉప్పల వాసు బాబు, ముదునూరి ప్రసాదరాజు, కొట్టు సత్యనారాయణ, కొఠారు అబ్బాయి చౌదరి, తలారి వెంకట్రావు, ఎస్.సి.కార్పొరేషన్ చైర్మన్ చెల్లెం ఆనంద్ ప్రకాష్, పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి, డీసీఎంఎస్ చైర్మన్, వేండ్ర వెంకట స్వామి ప్రభృతులు ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలికారు. ఫై తాజా చిత్రంలో సీఎం జగన్ కు పుష్ప గుచ్చం తో స్వాగతం తో పాటుగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్న ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ను చూడవచ్చు..
