సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, ఆదివారం ఉదయం మంత్రి బొత్స సత్యనారాయణ తన ఉత్తరాంధ్ర వైసిపి అభిమానులతో కలసి కేక్ కట్ చేసి న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. మీ అందరికి శుభవార్త తెలియజేస్తున్నానని మరో 3 నెలలో విశాఖ రాజధానిగా రాష్ట్ర ప్రభుత్వ పాలన ను సీఎం జగన్ ప్రారంభిస్తారని సంచలన వ్యాఖ్యలు చేసారు. ఈ ఏడాది సీఎం జగన్ మరింత మంచి పాలన అందిస్తారన్నారు. భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి త్వరలో శంకుస్థాపన చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *