సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: 2023 నూతన ఏడాది ప్రారంభ సందర్భముగా నేడు, ఆదివారం గ్రంధి శ్రీనివాస్ అయన కార్యాలయం వద్ద నేటి , ఉదయం 7గంటల నుండి ప్రజలు, ప్రభుత్వ ఉద్యొగులు. అధికారులు,వేలాది మంది అభిమానులు, వైసిపి క్యాడర్ లతో భారీ సందడి నెలకొంది. ( గత 3 దశాబ్దాల నుండి గ్రంధి వారి ఇంట రాజకీయాలతో సంబంధం లేకుండా అభిమానుల సంబరం ఇది మాములే.. అయినప్పటికీ) నేటి మధ్యాహ్నం 12 దాటిన ఎడతెగని ప్రజలు క్యూ లైన్ లో నిలబడి గ్రంధి శ్రీనివాస్ ను కలసి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఉదయం 11 గంటల కు ఒక దశలో ఆయన ఆఫీస్ రూంలో దూసుకొని వస్తున్నా అభిమానుల తాకిడికి ఆయన తట్టుకోలేక పోయారు. దానితో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అందరిని సముదాయిస్తూ ఆఫీస్ బయటకు వచ్చి ఆవరణలో ఏర్పటు చేసిన టెంట్ క్రింద నిలబడి ప్రతి ఒక్కరిని ఓపికతో చిరునవ్వుతో పలకరిస్తూ వారి శుభాకాంక్షలు అందుకోవడం జరిగింది. మన సిగ్మా వీక్షకుల కోసం 2023 కు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసారు. ( ఫై తాజా చిత్రంలో )నియోజక వర్గ ప్రజలు సుఖశాంతులతో 2022 లో మరింత అభివృద్ధి సాధించాలని , సీఎం జగన్ సహకారంతో తనవంతు కృషి చేస్తానని MLA గ్రంధి శ్రీనివాస్ సిగ్మా న్యూస్ తో అన్నారు..వచ్చిన వేలాది మందికి షమియానా టెంట్లలో టిఫిన్, భోజన ఏర్పాట్లు చేసారు. గ్రంధి శ్రీనివాస్ కుమారుడు గ్రంధి రవితేజ వచ్చిన నేతల నుండి కార్యాలయ బయటే శుభాకాంక్షలు అందుకొంటూ నిలబడటం గమనార్హం. ఇక శాసన మండలి చైర్మెన్ కొయ్యే మోషేను రాజు అమరావతి లో ఉండటం తో భీమవరంలో వేడుకలకు దూరంగా ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *