సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఒక ప్రక్క ఆంధ్ర ప్రదేశ్ లో ఇటీవల.. కూటమి సర్కార్ నేతృత్వంలో జరిగిన డీఎస్సీ పరీక్షలలో ఉద్యోగాలకు అభ్యర్థుల ఎంపికలో స్కాం జరిగిందని కొందరు అభ్యర్థులు పిర్యాదులు, మంత్రి లోకేష్ రాజీనామా చెయ్యాలని, సిబిఐ దర్యాప్తు చెయ్యాలని ప్రతిపక్ష వైసీపీ ఉద్యమం నిరసనలు కొనసాగుతుండగానే .. మరో ప్రక్క రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏపీ విద్యాశాఖ తాజగా విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. వచ్చే అక్టోబర్‌లో మరో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి, డిసెంబర్‌లో పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. అభ్యర్థులు సోషల్ మీడియాలో జరుగుతున్నా తప్పుడు ప్రచారాలను నమ్మకుండా రానున్న డీఎస్సీపై దృష్టి సారించి ప్రిపరేషన్ ప్రారంభించాలని అధికారులు పేర్కొన్నారు.
