సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం స్థానిక భీమేశ్వర స్వామి గుడి వద్ద ఉన్న జనసేన కార్యాలయంలో .. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అడ్జక్షుడు కోటికల పూడి గోవిందరావు కు జిల్లా వ్యాప్తంగా జనసేన కార్యకర్తలు జడ్పీటీసీ, ఎంపీటీసీ లు, కౌన్సెలర్స్ తో పాటు పార్టీలకు అతీతంగా భీమవరం పట్టాన ప్రముఖులు మాజీ కౌన్సెలర్స్ విశేషంగా వచ్చి ఆయనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజెయ్యడం జరిగింది. వచ్చిన అతిధులకు ఆయన కార్యాలయం ఆవరణలోనే టిఫిన్స్, భోజనాలు ఏర్పాటు చెయ్యడం జరిగింది. జనసేన జిల్లా కార్యదర్శి c చంద్ర శేఖర్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. తెలుగు దేశం పార్టీ జిల్లా అడ్జక్షురాలు తోటా సీతారామలక్ష్మి, మరియు రాష్ట్ర కార్యదర్శి మెంటే పార్ధసారధి నివాసాల వద్ద్ద కూడా నూతన సంవత్సర వేడుకల కోలాహలం కనపడింది.
