సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గుంటూరు లో మృతి చెందిన మహిళల కుటుంబాలను అన్ని విధాలా అదుకొంటామని సీఎం జగన్ ప్రకటించారు. టడీపీ అధినేత చం ద్రబాబు , అతని అనుకూల మీడియా వారి డ్రోన్ షాట్ లు జనం బాగా వచ్చారని చేసే హడావిడి ప్యూహాలు వారి పబ్లిసిటీ పిచ్చి కారణం గా ఆయన సభలలో ఎదో నాలుగు డబ్బులు, కానుకలు వస్తాయని వెళ్లిన పేద ప్రజలు చనిపోతున్నారని, పేర్ని నాని, మంత్రి మంత్రులు అంబటి,జోగి రమేష్ తీవ్ర ప్రదజాలంతో విమర్శించారు. అసలు చంద్రబాబు సభలకు పోలీసులు అనుమతి ఇవ్వకూడని జోగి రమేష్ వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ సందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ.. చం ద్రబాబు ఇదేం కర్మ సభలకు తీసుకోని వచ్చిన పేద ప్రజలను టీడీపీ వారి పిచ్చి పబ్లిసిటీ కోసం ఇరుకు సందులులో , చంద్రన్న కానుకలు అంటూ భ్రమ కల్పించి చంపెయ్యడం దారుణమని ఈ ఘటనలకు చం ద్రబాబు, లోకేష్, పచ్చ మీడియా అధినేతలను బాధ్యు లను చేయాలి.అని విమర్శించారు. గుంటూరులో చంద్రబాబు సభకు వస్తే కానుకలిస్తామని పదిరోజుల నుం చి ప్రచారంతో ఊదరగొట్టారు. ఒక్కో మహిళకు మూడు చీరలిస్తామని చెప్పారు. 30 వేల మంది టోకెన్లు పంచారు. కానుకలు ముందే ఇస్తే చంద్రబాబు సభలో ఎవరు ఉండరని వారికీ సభ అయ్యాక ఇస్తామని మాయమాటలు చెప్పి 5 గంటలు నిలబెట్టారు. అయితే నలుగురికి చీరలు పంచి హడావుడి చేశారు. తొక్కి సలాట కారణంగా ముగ్గురు చనిపోయారు. ఈ మరణాలకు ఎవరు బాధ్యత వహిస్తారు. వీళ్ల ఉసురు చంద్రబాబుకి కచ్చితంగా తగులుతుంది. చంద్రబాబుకి సిగ్గు, శరం లేదు. అధికారంలోకి రావడానికి ఎవరెలా చచ్చినా చంద్రబాబుకి అవసరం లేదు. గతంలో రాజమండ్రి పుష్కరాలలో 29 మంది మృతి కి కారణమయ్యాడు. చంద్రబాబు ఎక్క డ కాలు పెడితే అక్క డ నాశనమే. ఈ ఘటనపై ప్రభుత్వం విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి. అని డిమాండ్ చేసారు.
