సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో పుష్ప విజయపరంపర దేశ విదేశాలలో ఇంకా కొనసాగుతూనే ఉన్నది. ‘పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైరు’ అంటూ ఈ చిత్రం తెలుగులో కన్నా ఉత్తరాదిన పాన్ ఇండియా మూవీగా సంచలన విజయం సాధించింది. ఇటీవల ఈ చిత్రాన్ని రష్యా లోనూ విడుదల చేశారు. అక్కడ కూడా ‘పుష్ప’ 25 రోజుల్లో ఈ చిత్రం 10 మిలియన్ రుబెల్స్ ను వసూలు చేసింది. అంటే ఇండియన్ కరెన్సీలో రూ.13కోట్లు వసూలు చేసింది. ఇప్పటికీ రష్యన్ బాషలో 774 థియేటర్స్ లో ఈ చిత్రాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇటీవల కాలంలో రష్యా లో కార్తీ ఖైదీ తమిళ డబ్బింగ్ తరువాత రష్యాలో భారీ విజయం సాధించిన సినిమాగా పుష్ప విజయ యాత్ర కొనసాగిస్తుంది.. ఇటీవల పుష్ప 2వ భాగం షూటింగ్ చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. కీలక సన్నివేశాల కోసం చిత్ర బృందం ఇటీవల థాయిలాండ్ వెళ్లింది. అల్లు అర్జున్ సరసన రష్మి క నటిస్తుండగా, ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రామ్ చరణ్ కీలక పాత్రలో నటిస్తారని భావిస్తున్నారు. అధికారికంగా ఇంకా ప్రకటించలేదు.
