సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో కరెంట్ వినియోగదారులపై అదనపు భారాన్ని మోపడానికి కొత్త నిబంధనలు తాజాగా జారీచేసింది. ఇకపై విద్యుదుత్పత్తికి వినియోగించే ఇంధనం ఛార్జీలు, విద్యుత్తు కొనుగోలు ధరలు పెరిగినప్పుడు ఆ అదనపు భారాన్ని ప్రతినెలా ఆటోమేటిక్ గా వినియోగదారుడిపై పడేలా విద్యుత్తు కమిషన్ ఒక ఫార్ములా రూపొందించాలని కేంద్ర విద్యు త్తుశాఖ తాజాగా పేర్కొంది. ఈ మేరకు విద్యుత్తు నిబంధనలు-2005ని సవరిస్తూ కొత్త నిబంధనలు జారీచేసింది. భారాన్ని నెలవారీగా ఆటోమేటిగ్గా వినియోగదారుల టారిఫ్కి మళ్లించేలా విద్యుత్తు కమిషన్ 90 రోజుల్లోపు ఒక ఫార్ములా రూపొందించాలని ఈ నిబంధనల్లో పేర్కొంది. ఇకపై వినియోగదారులకు పెరిగిన టారిఫ్ ఇవ్వకుండా డిస్కంలు ఎప్పటికప్పుడు ఇంధన, విద్యుత్తు కొనుగోళ్ల ఖర్చులను లెక్కించి ఆ తర్వాతి నెలలో వాటిని బిల్లుల్లో చేర్చాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ రెండునెలలకు మించి జాప్యం జరగకూడదు అని ఆదేశాలు ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *