సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రైతుభరోసా కేంద్రాలలో మొత్తం 21,731 మందితో పోస్టుల భర్తీ పూర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇప్పటికి 660 మండలాల్లో10,778 ఆర్బీ కేలు ఏర్పా టు చేయగా వీటిలో 14,347 మంది సేవలందిస్తున్నా రు. ఈ క్రమంలో ఇంకా శాఖల వారీ ఖాళీగా ఉన్న 7,384 పోస్టులను కూడా భర్తీ చేయనున్నారు. ఈ మేరకు ఆర్బీ కేల ఏర్పాటు సమయంలో మంజూరు చేసిన పోస్టుల సంఖ్యను బట్టి శాఖల వారీగా ఖాళీలను గుర్తించారు. అత్యధికంగా 5,188 పశుసం వర్ధక సహాయక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటి తర్వా త 1,644 ఉద్యాన, 467 వ్యవసాయ, 63 మత్స్య, 22 పట్టు సహాయకుల పోస్టులు ఖాళీగా ఉన్నట్టుగా లెక్క తేల్చా రు. ఏపీపీఎస్సీ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటికి త్వరలో నోటిఫికేషన్ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ పోస్టులను కూడా భర్తీ చేస్తే ఆర్బీకేల్లోపనిచేసేవారి సంఖ్య 21,731కి చేరుతుంది.
