సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీమావుళ్ళమ్మ అమ్మవారి స్వర్ణ వస్త్రానికి భక్తులు అందిస్తున్న సహకారం మరువలేనిదని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు. నేడు, గురువారం భీమవరం మండలం చిన అమిరం గ్రామానికి చెందిన గొట్టుముక్కల రమేష్ రాజు, వెంకట లక్ష్మి పద్మావతి దంపతులు రూ 2,01,116 లను అమ్మవారి స్వర్ణ వస్త్రానికి కానుకగా అందించారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ ..అమ్మవారికి పూర్తి స్వర్ణ మయం కావడానికి సుమారు 27 కేజీల బంగారం కావాల్సి ఉందని, అన్నారు. కార్యక్రమంలో ఆలయ ఈవో, చైర్మన్, ధర్మకర్తలు , స్వర్ణ వస్త్రా నిధి కమిటి సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *