సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో ఈనెల 8న నిర్వహించే ఏపీపీఎస్సీ గ్రూపు –1 పోటీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిలా ఇన్‌చార్జి రెవెన్యూ అధికారి దాసి రాజు జిల్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో చీఫ్‌ సూపరింటెండెంట్లు, హాల్‌ సూప రింటెండెంట్లు, ఇన్విజలేటర్లతో ఆయన ఏర్పట్లఫై సమీక్ష నిర్వహించారు. భీమవరంలో 10 సెంటర్లలో పరీక్షలు జరుగుతాయని, ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు నిర్వహిస్తామన్నారు. భీమవరంలో పరీక్షలు కేజీఆర్‌ ఎల్‌ కళాశాల, డీఎన్‌ఆర్‌ కళాశాల, విష్ణు ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, విష్ణు మహిళ ఇంజనీరింగ్‌ కళాశాల, వీఎస్‌కే డిగ్రీ కళాశాల, కేజీఆర్‌ఎల్‌ కాలేజ్‌ పీజీ కోర్స్‌స్‌ కళాశాల, డాక్టర్‌ సీఎస్‌ఎన్‌ డిగ్రీ, పిజీ కళాశాల, ఆదిత్య డిగ్రీ కళాశాల, కేజీఆర్‌ఎల్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఫార్మసీ కళాశాల, బ్రౌనింగ్‌ జూనియర్‌ కళాశాలలో
నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి పరీక్షా కేంద్రానికి కో–ఆర్డినేట్‌ అధికారులను నియమించామని, ప్రతి హాలుకు చీఫ్‌ సూపరింటెండెంట్‌ ఆఫీసర్లను నియమించామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *