సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ముఖ్యమంత్రి వై.యస్ జగన్ మోహన్ ప్రజా సంకల్ప యాత్ర ముగిసి నేటి జనవరి 9వ తేదీకి నాలుగేళ్లు పూర్తి అయిన సందర్భంగా నేటి సోమవారం,భీమవరం వైసిపి కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ , వేండ్ర వెంకట స్వామి, గూడూరి ఉమాబాల, మేడిది జాన్సన్, పేరిచర్ల నరసింహరాజు కామన నాగేశ్వరరావు తదితర వైసీపీ కీలక నేతలు దివంగత వై ఎస్ విగ్రహానికి పుష్ప మాలలు వేసి సీఎం జగన్ కు శుభాబినందనాలు ప్రకటించారు. ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా 3400 కిమీ పాదయాత్ర చేసి జగన్ ప్రజలకు ఏమి కావాలో ? వారి సమస్యలు, కష్టాలు తెలుసుకొని ప్రజల లక్ష్యాలు నెరవేరేలా పార్టీ మ్యానిపెస్టో తయారు చేసి తాను అదికారంలోకి వచ్చాక అందులో ఇచ్చిన హామీలు నూటికి నూరుశాతం అమలు చేస్తున్న ఘనత సాధిస్తున్నారని , ప్రతి కుటుంబానికి లక్ష నుండి 5 లక్షల రూపాయలు వరకు ఫలాలు అందేలా కృషి చేస్తున్నారని , చంద్రబాబు ప్రజా సంక్షేమానికి అడ్డు తగులుతున్న కూడా విభజన తరువాత రాష్ట్రము ఆర్ధికంగా ఎన్ని ఇబ్బందుల్లో ఉన్న జగన్ ప్రజా సంక్షేమం సాధించడమే టార్గెట్గా పనిచేస్తున్నారని అన్నారు.
