సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి నేడు, సోమవారం తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ,.. పచ్చ మీడియా వారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అక్రమ సంబంధానికి పవిత్రతను అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేయరు. చంద్రబాబు పర్యటనలో ‘11 మంది చనిపోతే పవన్ కనీసం వారి కుటుంబాల గురించి మాట్లాడలేదు సరికదా, అసలు ఆ మరణాలకు కారణమైన చంద్రబాబును పరామర్శించడం విడ్డూరం. ఎంతమంది కలిసి వచ్చిన మా ప్రభుత్వానికి ఇబ్బంది లేదు. వచ్చే ఎన్నికల్లో గెలిచేది వైఎస్ జగన్ ప్రభుత్వమే’’ అని సజ్జల పేర్కొన్నారు.‘‘2024 షెడ్యూల్ ప్రకారమే ఎన్నకలు జరుగుతాయి‘. వెంటిలేటర్ ఫై ఉన్న పార్టీలే ముందస్తు ఎన్నికలు కోరుకుంటున్నాయి. బలమైన జగన్నుఎదుర్కొనేందుకు వీళ్లంతా ఏకమవుతున్నారు. బీజేపీ కూడా వారితో కలిస్తే సీపీఐ రామకృష్ణ ఏం చెప్తారు. పందికొక్కులు, గుంటనక్కలు ఏకం కావడాన్ని జనం చూస్తున్నరు. జగన్ కు ఉన్న ప్రజాబలం ముందు ఎవరూ నిలవలేరు’’ అని సజ్జల రామకృ ష్ణారెడ్డి అన్నా రు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *