సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాకరంగా నిర్మిస్తున్న బియ్యపుతిప్ప ఫిష్ హార్బర్, కార్గో పోర్టుకు కేంద్రం నుంచి పర్యావరణ అనుమతి లభించింది. రూ.429.43 కోట్లతో నిర్మించే ఈ పనులకు ఇప్పటికే టెండర్లు పూర్తయ్యాయి. గతేడాది నవంబరులో సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. ఎట్టకేలకు కేంద్రం పర్యావరణ అనుమతి ఇవ్వడంతో స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు హర్షం వ్యక్తం చేసి అతి త్వరలో వచ్చే నెల నుండి నిర్మాణ పనులు పారంబిస్తున్నట్లు ప్రకటించారు. కోస్తా ఆంధ్ర తీర ప్రాంతం వెంబడి ఆరు పోర్టులు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో బియ్యపుతిప్ప కీలకమైనది. కానీ కేంద్రం నుంచి పర్యా వరణ అనుమతి ఫైకొద్దీ కాలంగా ఏర్పడ్డ సందిగ్దం తొలగింది. ఇక హార్బర్‌కు ఇప్పటి వరకు ఉన్న ప్రధాన అడ్డంకి తొలగిపోయింది. ఈ హార్బర్ నిర్మాణం పూర్తీ అయితే ప్రక్కనే ఉన్న భీమవరం తీరప్రాంత మత్యకారులకు, ఆక్వా వ్యాపారులకు అటు కృష్ణ జిల్లా వారికీ కూడా ఉపయుక్తంగా ఉంటుంది.(ఫై ఫైల్ ఫోటో.. బియ్యపుతిప్ప హార్బర్ శంకుస్థాపన సందర్భములో మత్యకారులతో సీఎం జగన్ )
