సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా రాయికుదురు గ్రామంలో శ్రీ కృష్ణదేవరాయ నాటక కళా పరిషత్ వారు నిర్వహించిన నాల్గవ జాతీయ స్థాయి నాటక పోటీలకు శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు, ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ సంక్రాంతి వేడుకలలో భాగంగా సామాజిక రుగ్మతలను నిర్మూలించేందుకు నాటక రంగం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు, నాటక కళా రంగాన్ని కాపాడటానికి కృషి చేస్తున్న కమిటీ వారిని కళాకారులను అభినందించారు. అనంతరం శాసన మండలి చైర్మన్ ని కమిటీ వారు ఘనంగా సన్మానించారు.
