సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత వైసీపీ ప్రబుత్వ హయాంలో ఏర్పాటు చేసిన కొత్త జిల్ల్లాల నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా పలు భాగాలుగా విడిపోయినప్పటికీ ఇప్పటికి జిల్లా పరిషత్తు మాత్రం ఉమ్మడి గానే కొనసాగుతుంది. అయితే రాబోవు స్థానిక సంస్థలు ఎన్నికలు లో ఎన్నికయిన అభ్యర్థులతో విభాజన జిల్లాలకు కూడా స్వతంత్రంగానే జిల్లా పరిషత్తు కార్యాలయాలు ఏర్పాటు చేసి జడ్పీ చైర్మెన్ లను ఎంపిక చెయ్యాలని కూటమి ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రంలో 28 జిల్లాలకు జడ్పీ చైర్మెన్ లు రానున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక ఎన్నికల తరువాత .. భీమవరం కేంద్రంగా పశ్చిమగోదావరికి ప్రత్యేక జిల్లా పరిషత్‌ ఏర్పాటు కానున్నది. ఏలూరు కేంద్రంగా ఇప్పటికే కొనసాగుతున్న ఉమ్మడి జిల్లా పరిషత్తు లో అత్యధికరంగా వైసీపీ సభ్యులే ఎక్కువగా ఉండటం గమనార్హం.. ఇక త్వరలో భీమవరం కేంద్రంగా ఏర్పడే జడ్పీ చైర్మెన్ తమదేనంటూ తెలుగు దేశం పార్టీతో పాటు కూటమిపార్టీలలో ఆశావహులు ఇప్పటినుంచే పావులు కదుపుతున్నారు. అటు వైసీపీ లో కూడా మంచి ఫలితాలు సాధించి ప్రజా మార్పును స్వష్టం చెయ్యాలని ప్యూహం రచిస్తుంది. ఏది ఏమైనా కొత్త జిల్లా పరిషత్తు ప్రజలకు పాలన ఇన్నాళ్లకు మరింత సౌకర్యవంతం కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *