సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలోని కేంద్ర విద్య సంస్థ ఏపీ నిట్‌కు జాతీయ ప్రాజెక్టు మంజూరైంది. కొత్త స్పింట్రోనిక్స్‌ పదార్థాలపై ప్రయోగాత్మకంగా పరిశోధనలు చేసేందుకు వీలుగా సంస్థలోని ఫిజిక్స్‌ విభానికి చెందిన సహాయ అచార్యులు డాక్టర్‌ పరమానిక్‌ తపస్‌ రూ.31.4 లక్షల విలువైన అయస్కాంత, ఎలక్ర్టానిక్‌ లక్షణాలపై అధ్యయనాలు అనే ప్రాజెక్టును దక్కించుకున్నారు. ఈ ప్రాజెక్టును భారత ప్రభుత్వ అధీనంలోని సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ రీసెర్చ్‌ బోర్డు మంజూరు చేసింది. ఈ సందర్భంగా ఇన్‌చార్జి డైరెక్టర్‌ డాక్టర్‌ ఎం.ప్రమోద్‌ పడోలే, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ పి.దినేష్‌ శంకర్‌రెడ్డి మాట్లాడుతూ కొత్త స్పింట్రోనిక్స్‌ పదార్థంలో అయస్కాంతం, ఎలకా్ట్రనిక్స్‌ లక్షణాలపై పరిశోధనలు చేయడం ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశమన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *