సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షుడు కముజు హరిబాబు అధ్యక్షతన భీమవరం లోని పార్టీ జిల్లా కార్యా లయం లో తెలుగు దేశం పార్టీ జిల్లా అధ్య క్షురాలు, తోట సీతారామ లక్ష్మి మాట్లాడుతూ.. రాష్ట్రంలో జగన్ పాలనపై ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని, ఇక తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేశ్ బాబు పాదయాత్ర మొదలు పెడుతూండటం వైసిపి లో గుబులు మొదలయిందని, లోకేష్ పాదయాత్ర చేస్తే వచ్చే ఎన్నికల్లో TDPకచ్చితంగా గెలుస్తుందనే భయంతోనే జగన్ సర్కార్ జీవో-1 తీసుకొచ్చిందని పార్టీ జిల్లా అధ్య క్షురాలు తోట సీతారామలక్ష్మి అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖరరెడ్డి, జగన్మోహన్రెడ్డి పాదయాత్రలు చేయలేదా?.. వారికి తగిన భద్రతను టీడీపీ ప్రభుత్వం కల్పించలేదా? అని ప్రశ్నించారు. టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి మాట్లాడుతూ..,జీవో-1 వైసిపి నేతలకు వారు రాష్ట్రంలో ఇప్పటికి చేస్తున్న ర్యాలీలకు, రోడ్డు షో కార్యక్రమాలకు వర్తించదా? అని అన్నా రు. లోకేష్ పాదయాత్రను విజయవంతం చేసేందుకు శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ నేతలు కొల్లేపర శ్రీనివాస్, రేవు వెంకన్న, వీరవల్లి శ్రీనివాస్, కవురు పృథ్వీ శంకర్, తదితరులు పాల్గొన్నా రు.
