సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ విద్య శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ గత శనివారం పశ్చిమగోదావరి జిల్లాలో నాడు- నేడు.. లో ప్రభుత్వం అభివృద్ధి పరచిన పాఠశాలల ను తనిఖీ చేసి అక్కడ విద్యాప్రమాణాలు ను పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేసారు. ఆయన ఆకివీడులోని శివాలయం ప్రాథమిక, ఈస్టుపాలెం ప్రాథమికోన్నత పాఠశాలల్లో తనిఖీలు నిర్వహించారు .. అక్కడి విద్యార్థులను పలు పాఠ్యంశాలుపై, టీచర్లు పనితీరుపై ప్రశ్నించడం వారి వర్క్ బుక్స్ ను పరిశీలించడం చేసి అక్కడి టీచర్లు , జిల్లా విద్య అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇక్కడి పాఠశాలల్లో నాడు-నేడు పనుల్లో జాప్యం .. విద్యా బోధన అమలు తీరు, వారిపై పర్యవేక్షణ లోపం స్వష్టంగా కనపడుతుందని, ఇవన్నీచూస్తుంటే టైమ్ పాస్ కోసం మీరు ఉద్యోగం చేస్తున్నట్లు కనిపిస్తోంది. రూ. లక్షల్లో జీతాలు తీసుకుంటూ ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉండగలుగుతున్నారు? అని ఆర్జేడీ మధుసూదనరావు, డీఈవో వెంకటరమణ, డీవైఈవో శ్రీరామ్, ఎం ఈవో రవీంద్రను ప్రశ్నించారు. ఈ నలుగురు అధికారుల నుంచి వివరణ తీసుకోవాలని, వారు బాధ్యత నేరుచుకోకపోతే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రశాంతిని ఆదేశించారు.. తదుపరి అధికారులతో జిల్లా వ్యాప్తంగా వివిధ పాఠశాలల్లో జరుగుతున్న నాడు-నేడు పనులపై అధికారులతో సమీక్షించారు.
