సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సీనియర్ దర్శకుడు సాగర్ ఈరోజు గురువారం, (ఫిబ్రవరి 2, 2023 ) చెన్నై లో తుది శ్వాస విడిచారు. అతని వయస్సు 71 సంవత్సరాలు. ఈయన మంగళగిరి వద్ద నిడమర్రు అనే గ్రామంలో మార్చి 1, 1952 లో జన్మించారు. సుమారు 30 కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించిన సాగర్ గారు అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు. సూపర్ స్టార్ కృష్ణ తో ‘అమ్మదొంగా’ అనే సినిమా సాగర్ కెరీర్ లో బంపర్ హిట్ కాగా కృష్ణ తో భారత సింహం, అదిరింది గురు వంటి సినిమాలు చేసిన 4వ సినిమా జగదేక వీరుడు సూపర్ హిట్ గా మ్యూజికల్ హిట్ గా నిలచింది. ఇక సాగర్ మొదటి సినిమా సువర్టుపురం దొంగలు హిట్ అయ్యింది. సాగర్ దర్శకత్వం, నిర్మాతగా సుమన్ తో చేసిన ‘రామసక్కనోడు‘ సినిమా హిట్ తో పాటు మూడు నంది అవార్డులు వచ్చాయి. అలాగే సుమన్ తో ఆలుమగలు, ఓసి నా మరదలా? సొందర్య తో అమ్మనా కోడలా? సినిమాలు కూడా హిట్స్ సాధించాయి. అతను నిర్మాతగా ‘ఆశల పల్లకి’ అనే పిల్లల మీద చేసిన సినిమా చిల్డ్రన్ ఫిలిం ఫెస్టివల్ లో స్క్రీన్ చెయ్యటమే కాకుండా, అవార్డుని కూడా సొంతం చేసుకుంది. ఆసక్తికర అంశం ఏంటి అంటే ప్రముఖ దర్శకులు వి.వి. వినాయక్ , శ్రీను వైట్ల లాంటి ఎందరో సాగర్ గారి దగ్గర శిష్యరికం చేసి ఈరోజు అగ్ర దర్శకులు అయ్యారు. సాగర్ మృతికి సినీ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *