సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: ఇటీవల ముగిసిన తెలుగు బిగ్‌బాస్ 5 గ్రాండ్ ఫినాలే రోజు నెక్స్ట్ సీజన్ గురించి హోస్ట్ నాగార్జున మాట్లాడుతూ.. ఈసారి బిగ్ బాస్ సీజన్ ఆలస్యం కాదని మరో రెండు నెలల్లో (అంటే బహుశా ఫిబ్రవరి చివరలో లేదా మార్చిలో) బిగ్‌బాస్ 6 సీజన్ రాబోతుందని ప్రకటించాడు. అయితే, సోషల్ మీడియాలో మాత్రం బహుశా అది హాట్ సార్లో అది ఓటీటీ సీజన్ అయ్యుంటుందని ప్రచారం ? జరుగుతోంది. ఈ క్రమంలో దీనికి ఎవరు హోస్టింగ్ చేస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. బిగ్‌బాస్ తొలి సీజన్‌కు ఎన్టీఆర్, రెండో సీజన్‌కు నాని, మూడు, నాలుగు, ఐదో సీజన్లకు నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఆరో సీజన్‌కు మాత్రం నాగ్‌ను తప్పించి అఖండ ఘనవిజయం తో మంచి ఊపుమీద ఉన్న నందమూరి బాలకృష్ణ. ను సంప్రదింపులు జరుపుతున్నట్లు వార్త .. ఆహాలో అన్‌స్టాపబుల్ షోలో హోస్ట్‌గా బాలయ్య మంచి పాపులారిటీ సంపాదించాడు. .ఇక బిగ్ బాస్ హౌస్ లోని వారు బాలయ్య మాటే వినాలి.. లేదంటే.. తబిడ దిబిడే దీంతో ఈ రియాలిటీ షోను బాలయ్యకు అప్పగిస్తే హోస్టింగ్, ఎంటర్‌టైనింగ్ వేరే లెవల్ చాల ఆసక్తిగా ఉంటుంది. అయితే హోస్టింగ్ లో, ఆటలు ఆడించడంలో సుమ లాగా బాగా పట్టు సంపాదించిన నాగార్జునను కాదని బాలయ్యను హోస్టుగా పెడితే? ఇంకా సమయం ఉంది.. ఏమి జరగనుందో? కదా?
