సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: తూర్పుగోదావరి జిల్లాలో చంద్రబాబు పర్యటన విజయవంతం చేయాలని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ పిలుపునిచ్చారు. గోకవరంలో టీడీపీ నాయకుడు పైలా శ్రీనివాస్‌ నివాసంలో చంద్రబాబు పర్యటనపై తాజగా కార్యకర్తలతో సమీక్షించారు. 15వ తేదీన చంద్రబాబు ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి.. కార్యక్రమంలో భాగంగా గోకవరం విచ్చేయనున్నారని తెలిపారు. రాజమండ్రి మధురపూడి విమానాశ్రయానికి 15 వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు చేరుకుంటారన్నారు. అక్కడ నుంచి గోకవరం మండలం గుమ్మళ్ళదొడ్డి మీదుగా గోకవరం చేరుకోవడం జరుగుతుందన్నారు. 16వ తేదీన కాకినాడ రోడ్‌లో గల హెచ్‌పీ పెట్రోల్‌ బంక్‌ సమీపంలో ఉన్న ఖాళీ స్థలంలో జగ్గంపేట నియోజకవర్గానికి చెందిన నాయకులతో చర్చిస్తారన్నారు.అనంతరం పెద్దాపురం నియోజకవర్గ పర్యటనకు వెళతారని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *