సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: దేశంలో ఇటీవల రుణ యాప్‌ల ఆగడాలు, బెట్టింగ్ యాప్‌ల పర్యవసనాల నేపథ్యంలో తాజగా కేంద్ర ప్రభుత్వం మరోసారి అత్యంత సంచలన నిర్ణయం తీసుకుంది. డ్రాగన్ దేశం చైనా మూలాలున్న 138 బెట్టింగ్ యాప్స్ , 94 రుణ యాప్‌లపై నిషేధం , మరికొన్నింటిని బ్లాక్ చేయాలనే నిశ్చయించింది. మొత్తం 232 యాప్స్‌పై తక్షణ, అత్యవసర ప్రాతిపదికన ఈ చర్యకు సిద్ధమైనట్టు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్ట్రీ వర్గాలు ప్రకటించాయి.యాప్‌ల బ్లాక్‌కు సంబంధించిన ప్రక్రియ ఇప్పటికే మొదలైందని సమాచారం. ఐటీ చట్టంలోని సెక్షన్ 69 కింద ఈ చర్య తీసుకున్నట్టు సంబంధితవర్గాలు వెల్లడించాయి. ఈ యాప్‌లను చైనా పౌరులే రూపొందించారని, భారత్‌లో ఇక్కడేవారినే డైరెక్టర్లుగా నియమించుకుని దా‘రుణా’లకు పాల్పడుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. ఈ యాప్ ల వలలో పడి సర్వము కోల్పోయిన బాధితులు ఆత్మహత్యలకు పాల్పడిన పలు ఘటనలు వెలుగుచూశాయి. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ తరహా ఘటనలు ఎక్కువగా జరిగిన విషయం గమనార్హం..ఆ నిషేదిత యాప్స్ ఇంకా ఎవరి ఫోన్ లోనైనా ఉంటే వారిపై చర్యలు తప్పవు..
