సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా రాయకుదురు శివారు, నడపన వారిపాలెం. గ్రామంలో నూతనంగా పునర్ నిర్మించిన మహిమానీత.. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం లో భాగం రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుతో కలిసి భీమవరం ఎమ్మెల్యే శ్రీ గ్రంధి శ్రీనివాస్ నేడు, (5-2-23) ఆదివారం ఉదయం సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో సాంప్రదాయ బద్దంగా పాల్గొన్నారు. దీనిలో భాగంగా శ్రీ సుబ్రమణ్య స్వామి , వల్లి దేవసేన విగ్రహాలను వారి తలలపై పెట్టుకొని స్థానిక ప్రజలు భక్తులు వెంటరాగా మేళ తాళాల మధ్య దేవాలయం వరకు మోసుకొని వచ్చి శ్రీ స్వామి దేవేరుల విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమాలు, యాగ క్రతువులు దగ్గరుండి నిర్వహించడం గమనార్హం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *