సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం జోన్ లో ఎస్ఐలు ఇక్కడికి పరిసర ప్రాంతాలకే బదిలీ చేస్తూ తాజగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. భీమవరం నుండి ఎన్.శ్రీనివాసరావును పాలకోడేరుకు , పాలకోడేరులో పనిచేస్తున్న రామచంద్రరావును డీసీఆర్బీ కి భీమవరం లో పనిచేస్తున్న ఏజీఎస్ మూర్తిని కాళ్ల పోలీస్ స్టేషన్కు , మల్లికార్జున రెడ్డిని భీమవరం ట్రాఫిక్ కు, ఇక్కడ పనిచేస్తున్న బండి మోహనరావును భీమవరం రూరల్ పోలీస్ స్టేషన్ కు, అప్పలరాజును వీఆర్ కు మార్చినట్లు తాజా సమాచారం. వీరి బదిలీలు భీమవరం ఉండి నియోజకవర్గాలకు పరిమితం కావడం గమనార్హం..
